Thursday, 5 November 2026

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఖాయం మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ డిసిసి అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి

వికారాబాద్ రూరల్ మే 19 జనం సాక్షి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గురువారం సాయంత్రం నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ నివాసంలో సమావేశంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ. రామ్ మోహన్ రెడ్డి కలిసి నిర్వహించిన పత్రిక సమావేశం వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి అధ్వర్యంలో రిజర్వ్ నియోజకవర్గాలలో లీడర్షిప్ డెవలప్మెంట్ గురించి ఎల్ డి ఎం డెవలప్మెంట్ మిషన్ కార్యక్రమాన్ని తీసుకుందని ఈ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం చామల రఘుపతి రెడ్డి ని ఇన్చార్జిగా నియమించడం జరిగిందని టిఆర్ఆర్ గారు తెలిపారు..కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికలలో విజయం సాధించే విధంగా రిజర్వుడు నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లాంటి అనుబంధ సంఘాలను ప్రతి మండలంలో ఏర్పాటుచేసి పార్టీష్టతకు ఎల్ డి ఎం తీసుకోరావడం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రిజర్వడ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటుందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు తెచ్చి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి మరియు వారి జనాభా ప్రకారం బడ్జెట్లో వారి నిధులు వారికి కేటాయించే విధంగా ఎస్సీ, ఎస్టీలను సబ్ ప్లాన్ను తీసుకురావడం జరిగింది.. ఈ పథకంలో రావాల్సిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం రద్దుచేసి ఆ నిధులను కేవలం దళిత బంధు పేరిట పంచుతున్నారని తెలిపారు. కెసిఆర్ ప్రభుత్వం వికారాబాద్ జిల్లాకు తీరని అన్యాయం చేస్తుందని సాగునీరు రాకుండా అడ్డుకుంటుంది అని తెలిపారు.. కర్ణాటక వలే తెలంగాణలో కాంగ్రేస్ పార్టీ అదికారంలోకి రావడం ఖాయమని అప్పుడు జిల్లాకు సాగునీరు తెస్తామని ఈ ప్రభుత్వం వల్ల చేత కాదని మండిపడ్డారు.అదేవిధంగా యువతను ప్రోత్సహించ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్వర్యంలో యువజన కాంగ్రెస్స్ విభాగం తరపున తెలంగాణలో రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కొంపిటేషన్ కార్యక్రమాన్ని తెలంగాణ మొత్తంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.. ఈ కంపిటేషన్ పాల్గొనటానికి 7661899899 నంబర్ కి మిస్స్ కాల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 01 తేదీ లోపు పూర్తి చేసుకోవాలని తెలిపారుఈ కాంపిటేషన్ లో గెలిచిన వారికి స్కూటీ ఫోన్, ఇవి సెల్ ఫోన్ ఐప్యాడ్ బహుమతులు ప్రతి నియోజకవర్గానికి ఇస్తారని తెలిపారు…ఈ కార్యక్రమంలో అందరూ 16 నుండి 35 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు ..ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శిలు ధార సింగ్, సంతోష్, జిల్లా యువజన కాంగ్రెస్ అద్యక్షులు సతీష్ రెడ్డి, చమల రఘుపతి రెడ్డి గlసీనియర్ నాయకులు సత్యనారాయణ, నర్సింలు , బ్లాక్ అద్యక్షులు అనంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మండల అద్యక్షులు రాజశేఖర్, వెంకటేశం,రవీందర్, కోఆప్షన్ సభ్యులు జాఫర్, యూత్ కాంగ్రెస్స్ సంతోష్, శ్రీనివాస్ ముదిరాజ్,విజయ్ కుమార్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.