ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మహేశ్వరం నియోజకవర్గ బిజెపి రాష్ట్ర నేత, మాజీ సింగిల్విండో చైర్మన్ శ్రీ కొలన్ శంకర్ రెడ్డి బృందం హైదరాబాదు పార్టీ కార్యాలయంలో బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అయినా డాక్టర్ కె లక్ష్మణ్ ని నూతనముగా పార్లమెంటు బోర్డు సభ్యులు , ఎన్నికల కమిటీ సభ్యులుగా జాతీయ బిజెపి అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా నియమించిన శుభ సందర్భంగా వారిని కలిసి శాలువా కప్పి బొకే తో సన్మానించి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది, ఈ సందర్భంగా నూతనంగా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా నియమితులైన డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ నాకు ఈ పదవి రావడం అంటే ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని, బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త నాయకుడు ఈ సంవత్సరం కాలం పాటు పూర్తి సమయం ఇస్తూ ప్రజలతో మమేకమై పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు రాజకీయాల్లో పని చేసుకుంటూ పోతే పదవులు అవే మన ముందుకు వస్తాయని అన్నారు, ఇది రాష్ట్రంలో కుటుంబ పాలన అవినీతి పాలన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాని టిఆర్ఎస్ పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నందున విజయం కోసం మనం అందరం ముందుకు వెళ్లాలన్నారు, దేశంలో రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీదే విజయం అన్నారు, కాంగ్రెసు దేశ రాజకీయ చిత్రపటంలో పూర్తిగా నిర్వీర్యం అయిన పార్టీ అన్నారు, రాష్ట్రంలో టిఆర్ఎస్ బిజెపి మధ్యనే పోటీ అన్నారు కాంగ్రెస్ నామమాత్రమే అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వెంకటేశ్వర రెడ్డి, అనిల్ కుమార్, రాజు గౌడ్, ప్రశాంత్, సురేష్, సర్వేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే : బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా నియమితులైన డాక్టర్ లక్ష్మణ్




