పెగడపల్లి లో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి

పెగడపల్లి ఆగస్టు తేది 20(జనం సాక్షి )పెగడపల్లి మండల కేంద్రంలోని   కాంగ్రెస్ పార్టీ ఆఫిసులో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవగాంధీ గారి 78వ జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలొ
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బుర్ర రాములు గౌడ్ మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ రాజీవగాంధీ గారు స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారు అకశ్మిత హత్యకు గురైన సందర్బంగా అత్యవసరమైన సందర్బంగా శ్రీ రాజీవగాంధీ గారు భారతదేశ 6వ ప్రధానమంత్రిగా పనిచేసిన అతి చిన్న వయస్కుడు అని కొనియాడుతూ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుటకు మరియు సాంకేతిక రంగంలో ముందుకు తీసుకుపోవడానికి కృషిచేసిన మొదటి ప్రధానమంత్రిగా పేరుగడించాడు అంతేకాకుండా దేశానికి క్రీడా వ్యవస్థ అవసరం అని క్రీడాప్రాంగణాలకు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చాడు అదేవిధంగా దేశంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎక్కువ కృషిచేయడం జరిగింది విద్య వైద్యానికి ఎక్కువ కృషిచేసిన ఘనత కూడా అతనికే దక్కింది అతను 1984నుండి 1989వరకు పనిచేయడమేకాకుండా భారతదేశంలొ ఇప్పటివరకు అత్యధిక లోకసభ సీట్లు 508 లొ 401 సీట్లు గెలిపించుకున్న వ్యక్తిగా నేటికీ చిరస్థాయిలో నిలిచిపోయడాని అయన స్మృతులు గుర్తుండి పోయాయని ఈసందర్బంగా వారి జ్ఞపకాలను కొనియాడారు.. ఈకార్యక్రమంలో నంచర్ల సర్పంచ్ గోలి మహేందర్ రెడ్డి, లింగాపూర్ సర్పంచ్ ఈరెల్లి శంకర్,మండల ఉపాధ్యక్షులు తడగొండ రాజు,ప్రధానకార్యదర్శి చాట్ల విజయ భాస్కర్,అధికార ప్రతినిధి పూసాల తిరుపతి,ప్యాసా పి ఏ  సి ఎస్ ఏ  డైరెక్టర్ తోట మల్లేశం,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పురుషోత్తం అనిల్ గౌడ్,జిల్లా కార్యదర్శి  జీలా రాకేష్ యాదవ్,జితేంధర్ గౌడ్, బత్తిని శేఖర్ గౌడ్,సాయిల్లా రాకేష్,పెంటల తిరుపతి, సీనియర్ నాయకులు �