Tuesday, 3 November 2026

తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతం : తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

తెలంగాణలో   పెట్టుబడులు పెట్టాలని  ఎన్ఆర్ఐ లకు  పిలుపునిచ్చిన    ఉప్పుల

 ఎల్బీనగర్( జనం  సాక్షి )  టెక్సాస్‌లోని డల్లాస్‌లోని అవర్ ప్లేస్‌లో  డల్లాస్  ఎన్నారై వి ఎ ఆధ్వర్యంలో    తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ని       ఘన సన్మానం చేశారు . రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి ,   తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్  , కెటి ఆర్ ప్రవేశపెట్టిన వివిధ కార్యక్రమాలు  పెట్టుబడుల గురించి చర్చించారు.  ఈ సందర్బంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ    తెలంగాణను పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థానంగా మార్చడానికి, రాష్ట్ర ప్రభుత్వం టి ఎస్ ఐపాస్  ని అమలులోకి తెచ్చిందనిఅన్నారు  .  తెలంగాణలోని వివిధ చారిత్రక ప్రదేశాలు, స్మారక చిహ్నాలు, కోటలు, జలపాతాలు , దేవాలయాలను సందర్శించడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడానికి , తెలంగాణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని  ఎన్ఆర్ఐ  లను ప్రోత్సహిస్తుందని తెలిపారు ..     తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి  వి శ్రీనివాస్ గౌడ్  పర్యవేక్షణలో అభివృద్ధి చేయబడుతుందని  అన్నారు .    ఈ కార్యక్రమం లో డల్లాస్  ఎన్నారై వి ఎ   ప్రతినిధులు లక్ష్మీ కాంబోజి, సుధాకర్ పెన్నం, శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు