Wednesday, 4 November 2026

తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు

.రఝునాధపాలెం సెప్టెంబర్ 16 జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు నిర్ణయించడం పట్ల బిఆర్ అంబేద్కర్ ప్రజా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్ హర్షం ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు భారత రాజ్యాంగం నిర్మాణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న రాష్ట్రాల ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా అవకాశం కల్పించడం వల్ల రాజ్యాంగబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని లింగాల రవికుమార్ అన్నారు అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణంలో మన దేశం కోసం తన శక్తిని తన మేధస్సుని తన సర్వస్వాన్ని ధారపోసి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నూతన పార్లమెంట్ భవనానికి పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోడీకి లింగాల రవికుమార్ విజ్ఞప్తి చేశారు నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినట్లుగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్రాలు తీర్మానం చేసే కేంద్రానికి పంపించాలని లింగాల రవికుమార్ విజ్ఞప్తి చేశారు