తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శం.

తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శం.

తాండూరు అక్టోబర్ 7 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శమని 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు శనివారం తాండూరు పట్టణం 49వ రేషన్ షాప్ లో 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గాంధీ నగర్ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మహోన్నతమైందని అన్నారు. ఆడపడుచుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతి సంవత్సరం దసరా పండుగ దృష్టిలో ఉంచుకొని బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని గుర్తు చేశారు .ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి తాండూరు పట్టణం మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలోఆర్పి శోభ, ఆర్ పి ఉమా, వార్డు మహిళలు తదితరులు ఉన్నారు.