హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కోసం ముందుండి పోరాడుతామని, నిరంతరంగా శ్రమిస్తున్నామని మంత్రి జానారెడ్డి తెలిపారు. తెలంగాణ సాధన సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాదనలో అగ్రభాగాన ఉంటామని చెప్పడానికే ఈ సభ నిర్వహించామని తెలిపారు. తెలంగాణ నినాదం ఢల్లీిలో మార్మోగాలి అని పిలుపునిచ్చారు. సభలో ఇతరులను ఉద్దేశించి మాట్లాడొద్దని ఇతర నేతలకు జానారెడ్డి సూచించారు.




