హైదరాబాద్,మార్చి3(జనంసాక్షి): హైకోర్టు విభజన కోరుతూ తెలంగాణ న్యాయవాదులు శాసనసభ ఎదుట అమరవీరుల స్థూపం వద్ద ధర్నా చేశారు. గత కొద్ది రోజులుగా వీరు పలు రూపాలలో ఆందోళన సాగిస్తున్నారు. వెంటనే హైకోర్టును విభజించాలని అన్నారు. రాష్టాన్న్రి విమర్శించినా హైకోర్టును విబజించకపోవడం దారుణమన్నారు. ఇది పాలకుల వైఫల్యమని మండిపడ్డారు. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు. రాష్ట్రంలోని కోర్టుల ఎదుట పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇదిలావుంటే కాగా ఈ అంశంపై లోక్ సభలో కూడా టిఆర్‌ఎస్ ఎమ్.పిలు ప్రస్తావించారు. టిఆర్‌ఎస్ పక్ష నేత జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది నెలల క్రితం రాష్ట్రం ఏర్పాటైనా ఇంతవరకు విభజన జరగకపోవడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. మరో ఎమ్.పి బి.వినోద్ కుమార్ మాట్లాడుతూ గత కొంతకాలంగా తాము చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. దానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కేంద్రం కూడా దీనికి సహకరించడానికి సిద్దంగా ఉందన్నారు. కొన్ని సున్నితమైన అంశాలు ఉన్నాయని,అందువల్ల శాంతియుతంగా పరిష్కారం చేయాలని కేంద్రం భావిస్తున్నదని మంత్రి సమాధానం చెప్పారు. ఇక హైకోర్డును విభజించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు వరంగల్ కోర్టు వద్ద ఆందోళనకు దిగారు. కోర్టు హాలు ముందు బైఠాయించి న్యాయవాదులు నిరసన తెలుపుతున్నారు.




