హైదరాబాద్: పోలీసులు అరెస్టు చేసిన తెలంగాణ వాదులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్‌కు తమకు ప్రభుత్వం నుంచి లిఖిత పూర్వక అనుమతి ఉందని ఆయన తెలియజేశారు. ఇవాళ ఉదయం సాలార్‌జంగ్ మ్యూజియం వద్ద నుంచి అడ్కొకేట్ జేఏసీ ఆధ్వర్యంలో బయలు దేరిన తెలంగాణ మార్చ్ సన్నాహక ర్యాలీని పోలీసులు అడ్డుకుని పలువురు అడ్వొకేట్లను అరెస్టు చేశారు. దీంతో ఆయన వారిని విడుదల చేపించేందుకు ప్రయత్నిస్తున్నారు.




