ఎల్బీ నగర్( జనం సాక్షి )తెలంగాణ విమోచన దినోత్సవ అమృత ఉత్సవాల సందర్భంగా బుధవారం మహేశ్వరం అర్బన్ నియోజకవర్గం లో జాతీయ జెండాలు చేతభూనీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది… ఇ బైక్ ర్యాలీకి ముక్య అతిధులుగా విచ్ఛేసి ఉద్దేశించి ఆర్ కె పురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టా ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం నిజాం పాలన నుండి విముక్తి కలిగి 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చింది
ఉద్యమ కాలంలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తాం అని చెప్పి ఎంతోమంది అమరుల త్యాగాల ఫలితంగా నేడు తెలంగాణ వచ్చినా కూడా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన స్వాతంత్ర దినోత్సవాన్ని ఎనమిది సంవత్సరాల నుండి జరుపుకోలేకపోతున్నాం..ముఖ్యమంత్ రి కేసీఆర్ ఎంఐఎం కు భయపడి చరిత్రను వక్రీకరిస్తూ జాతీయ సమైక్యత దినోత్సవం గా ప్రకటిస్తున్నారు.. ఇది ముమ్మాటికి తెలంగాణ విమోచన దినోత్సవమే అని అన్నారు .భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా తెలంగాణ స్వాతంత్ర్య పోరాటాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి గత కొన్నేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ పోరాడుతూనే ఉందని . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. సెప్టెంబర్ 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండాను ఆవిష్కరించి బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు…ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టా ఉపేందర్ రెడ్డి ,డివిజన్ అధ్యక్షులు ముంత రాములు యాదవ్,సిద్దు ముదిరాజ్, వెంకటేష్ యాదవ్, సుదర్శన్, వెంకట్ రెడ్డి, చిన్నం సతీష్,శివ యాదవ్,నర్సింహ రావు,సతీష్ నేత,కృష్ణ,పులి గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది




