తెలంగాణ సంచార ముస్లిం తెగల సంఘం నియోజకవర్గ నూతన కార్యవర్గం ఎన్నిక
వైరా (జనం సాక్షి) అక్టోబర్ 9న
వైరామండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో ఆదివారం తెలంగాణ సంచార ముస్లిం తెగల నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు ముస్తఫా ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జమీల్,వర్కింగ్ ప్రెసిడెంట్ ఖాదర్ సమక్షంలో ఎన్నిక చేయడం జరిగింది.
నియోజకవర్గ అధ్యక్షుడిగా జింకలగూడెం షేక్ ముస్తఫా, ప్రధాన కార్యదర్శి వైరా షేక్ బాబా, ఉపాధ్యక్షులుగా జింకలగూడెం హిమామ్ వలీ, బాద్ షా,వర్కింగ్ ప్రెసిడెంట్ గా గొల్లపూడి సుభాని, జాని జింకల గూడెం సైదా,ఏనుకూరు బషీరుద్దీన్, కొణిజర్ల రియాజ్ భాయ్ లను ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా పాలడుగు మస్తాన్ వలీ,హుస్సేన్,కమాల్, అఫ్జల్ లను ఎన్నుకున్నారు. అనంతరం నియోజకవర్గ యూత్ అధ్యక్షుడుగా జింకల గూడెం గ్రామానికి చెందిన ఇస్మాయిల్ ను ఎన్నుకున్నారు.నూతన కమిటీలుగా ఎంపికైన వారు జిల్లా కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.