తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి

తొర్రూర్ అక్టోబర్ 12 (జనం సాక్షి)
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులు కాపాడాలని పట్టణ కేంద్రానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జెల్లా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గురువారం పాఠశాలలో బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా విద్యార్థులు బతుకమ్మలను పేర్చి బతుకమ్మ వైభవాన్ని తెలియజేసే ఆటలు పాటలు ఆడి పాడి సంబరాలను జరిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు