మెదక్ : తెలంగాణ సాధనలో ఇదే ఆఖరి పోరాటమని మంత్రి పొన్నాల లక్ష్యయ్య స్పష్టం చేశారు. మెదక్ జిల్లా వర్గల్ మంత్రి మీడియాతో మాట్లాడారు. సాధన సభతో అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పారు. త్వరలోనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని అశాభావం వ్యక్తం చేశారు.




