Wednesday, 4 November 2026

తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తాం

.తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తాం.మల్కాజిగిరి.జనంసాక్షి.మార్చి24
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రానున్న రోజుల్లో మల్కాజిగిరి లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జోష్ణ అన్నారు.శుక్రవారం మౌలాలి డివిజన్ సంతోషి మా నగర్ లో నియోజకవర్గ కోఆర్డినేటర్లు జిల్లా శంకర్ గుప్తా, బత్తిని నరసింహ గౌడ్, సంతోష్ సాగర్, నరేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులను స్థానికులు ఇప్పటికీ గుర్తుపెట్టుకొని పార్టీకి అండగా ఉంటామని ప్రజల స్వాగతిస్తున్నారని తెలిపారు.పార్టీకి పూర్వ వైభవం రావడానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని అన్నారు.పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని,ఈనెల 29న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో రాములు యాదవ్,సాయి నాగార్జున,సత్యనారాయణ,రమణ, బాల్రాజ్,రియాజ్,కృష్ణ,సాయి తదితరులు పాల్గొన్నారు.