హైదరాబాద్,జూన్5(జనం సాక్షి):తెలుగు విశ్వవిద్యాలయం 2018-19విద్యాసంవత్సరానికి నిర్వహించే బీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులలో చేరడానికి ప్రవేశ గడువును పొడిగించినట్లు రిజిస్ట్రార్ అలేఖ్య తెలిపారు. ఆన్ లైన్ ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 15వరకు ధరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. ఆలస్య రుసుముతో జూన్ 20లోగా దరఖాస్తులను సమర్పించ వచ్చన్నారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చాని అన్నారు.




