తెలుగు నేటివిటీకి దగ్గరగా భోళాశంకర్‌

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ’భోళా శంకర్‌’ షూటింగ్‌ చక చకా జరుగుతోంది. తమిళ సూపర్‌ హిట్‌ మూవీ ’వేదాళం’ సినిమాకి అధికారిక రీమేక్‌ గా ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీని తెలుగు నేటివిటీకి, మెగాస్టార్‌ ఇమేజ్‌కు సరిపోయేలా కథలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేశారు.భోళా శంకర్‌ సినిమాలో చిరంజీవి సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా.. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్‌ కనిపించనుంది. అయితే, ఈ ఏడాది చివరిలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్‌ ప్లాన్‌ మారినట్టు తెలుస్తోంది. మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసిఫర్‌ కి రీమేక్‌ గా తెరకెక్కుతున్న గాడ్‌ ఫాదర్‌ సినిమాలో చిరు పవర్‌ఫుల్‌ రోల్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ రిలీజై సూపర్‌ రెస్పాన్స్‌ తెచ్చుకుంది. మోహన్‌ రాజా
తెరకెక్కిస్తున్న ఈ మూవీలో నయనతార, సల్మాన్‌ ఖాన్‌, పూరి జగన్నాథ్‌, సత్యదేవ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ మూవీని దసరా కానుకగా రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత యువ దర్శకుడు బాబీతో మెగాస్టార్‌ చేస్తున్న 154వ సినిమా రిలీజ్‌ ఉండబోతుంది. ప్రస్తుతం ఈ మూవీకి వాల్తేరు వీరయ్య అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటిస్తున్న ఇందులో మెగాస్టార్‌ ఊర మాస్‌ రోల్‌ చేస్తుండగా, దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2023, సంక్రాంతికి రిలీజ్‌ చేయనున్నారు. అయితే మెహర్‌ రమేష్‌ తో మెగాస్టార్‌ చేస్తున్న భోళా శంకర్‌ ని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్‌ చేసేలా మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా రానున్నట్టు సమాచారం