Tuesday, 3 November 2026

రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్

అల్వాల్ (జనంసాక్షి) జూలై 7
 మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించి బొకే అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నందికంటి శ్రీధర్ మాట్లాడుతూ గడిచిన సంవత్సరంలో పిసిసి అధ్యక్షులు ఎన్నో పోరాటాలు బహిరంగ సభలు ప్రజల పక్షాన నిలబడి అధికార టీఆర్ఎస్ పార్టీని ముచ్చెమటల పట్టించే విధంగా ప్రజల కోసం పని చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పనిచేయాలని వారు తెలిపారు.
Attachments area