తె జ స కార్యాలయంలో తెలంగాణ విలీనోత్సవాలు.

ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 17 ,(జనం సాక్షి ) ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో తెలంగాణ జనసమితి కార్యాలయంలో పార్టీ నాయకులు ,కార్యకర్తలు,అభిమానులు గ్రామస్తులు తెలంగాణ విలీన దినోత్సవాన్ని టీజేఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు.అనంతరం మాట్లాడుతూ ‘ నిజాం నవాబులతో చేతులు కలిపి తెలంగాణ ప్రజలపై పడి పీక్కుతిన్న రక్కసి దొరల పాలనపై తిరుగుబాటు చేసి సాయుధ పోరాటంలో అమరులైన వీర యోధులను ఆయన స్మరించుకున్నారు.పన్నెండు వందల మంది అమరుల బలిదానంతో వచ్చిన తెలంగాణలో అప్రకటిత నిజాం పాలన నడుస్తుందని,దొరల పాలన అంతమొందించి అమరుల ఆశయాలు సాదించేందుకు యువత మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కంతి మోహన్ రెడ్డి , జనసమితి పార్టీ జిల్లా ఉపాధ్యక్షలు మోషే ఆనంద్, పార్టీ జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్,మాజీ ఎంపిటిసి గూడ రాజారెడ్డి,మాజీ విండో చైర్మన్ అబ్బడి రాజారెడ్డి,పార్టీ మండల అధ్యక్షులు కంతి రమేష్,గూడ నర్సారెడ్డి,వార్డ్ మెంబర్ల ఫోరమ్ కన్వీనర్ ఒద్దే సోమేశ్,పార్టీ మండల కార్యదర్శి కళాల ప్రవీణ్, జనసమితి నాయకులుతిరుపతి,మనిదీప్,గజ్జ రాజేందర్ ,బాస లీడర్ సాయన్న, నందగోపాల్,బద్దీ రాములు,ఏశాల గంగారెడ్డి, రెబ్బటి మల్లయ్య యాదవ్,మోషే సంజీవ్,ఒర్రె మహేందర్,శేఖర్,రమేష్, చిట్యాల రాజేందర్, బాధనకుర్తి గంగారెడ్డి,కంతి లింగారెడ్డి,కొలకాని చిన్న నర్సయ్య, నాంతాబాద్ సతీష్,కృష్ణ, పసునూరి మారుతి,పత్తిరెడ్డి శ్రీనివాస్,కంతి ప్రశాంత్,దుబ్బాక ప్రసాద్, నలిమేల సాయిలు,గాంధారి హరీష్,గుమ్మడి నర్సయ్య, అన్నేపెల్లి అనిల్,శ్రీపాద ధర్మరాజ్ తదితరులు పాల్గొన్నారు.