ఘనంగా సుదర్శన హోమం
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఆర్కే పురం డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీ వాస్తవ్యులు తేలుకుంట్ల శారద రమేష్ గుప్తా నివాసంలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు. అనంతరం హోమానికి విచ్చేసిన భక్తులందరికీ పండ్లు ఫలాలు, దివ్య ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్కే పురం డివిజన్ మాజీ కార్పోరేటర్ (జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్), దేప సురేఖ భాస్కర్ రెడ్డి, తేలుకుంట్ల రజినీ కళ్యాణ్, చిలుక ఉపేందర్ రెడ్డి, నల్లేంకి ధనరాజ్ గౌడ్, చంద్ర శేఖర్ గుప్తా, మాడ్యాం సుధాకర్ గుప్తా, మాలే శ్రీమన్నారాయణ, పెద్దవూర సైదులు, శేఖర్, అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area




