తొలిమెట్టుపై మండల స్థాయి సమీక్ష సమావేశం
నాగర్ కర్నూల్ అక్టోబర్ 28 జనం సాక్షి:
మండల విద్యావనరుల కార్యలయంలో శుక్రవారం సాయంత్రం తొలిమెట్టుపై మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో తరగతి వారీగా కనీస అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించే ఉద్దేశం తో గత నెల నుండి అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమం పై మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులచే సమీక్ష సమావేశం మండల పరిషత్ సమావేశ మందిరం లో జరిగింది.
ఈ సమీక్ష సమావేశంలో డిఈఓ గొవిందరాజులు మాట్లాడుతూ… విద్యార్థులు అందరూ కనీస అభ్యసన సామర్ధ్యాలు సాధించే దిశగా ఉపాద్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బోధించాలని, ఒక సామర్ధ్యాన్ని సాధించిన తరువాతనే మరొక సామర్ధ్యాన్ని బోధించాలని, ఆ విధంగా విద్య సంవత్సరం ముగిసే సరికి తరగతి కి తగ్గ సామర్ధ్యాలు సాధించడానికి ఉపాధ్యాయులు కృషి చెయ్యాలని డిఈఓ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కార్యాలయ స్ట్రాంగ్ టీచర్ వెంకటేశ్వర్లు శెట్టి, ప్రధానోపాధ్యాయులు కురుమయ్య , రాజేశ్వర్ రెడ్డి పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిఆర్పిలు తదితరులు పాల్గొన్నారు
తొలిమెట్టుపై మండల స్థాయి సమీక్ష సమావేశం




