తోక పురుగులాంటి వాడు జగ్గారెడ్డి :సోలిపేట రామలింగరెడ్డి
హైదరాబాద్: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగరెడ్డి ఫైర్ అయ్యారు. జగ్గారెడ్డి సీమాంధ్ర పెట్టుబడిదారుల సెప్టిక్ ట్యాంకులో పుట్టి పెరుగుతున్న తోకపురుగులాంటి వాడని రామలింగారెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వింటుంటే ఆయనకు మెదడు మోకాళ్లలో ఉందనిపిస్తుందని ఎద్దేవా చేశారు. పశువుకున్న ఇంగీత జ్ఞానం జగ్గారెడ్డికి లేదని విమర్శించారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన తెలంగాణ ప్రజలకు జగ్గారెడ్డి ద్రోహం చేస్తున్నడని ధ్వజమెత్తారు.



