తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి చేయూత

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పుల్లూరి సురేష్ అనే ట్రాలీ ఆటో డ్రైవర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా నిరుపేద కుటుంబమైన సురేష్ కుటుంబానికి ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో సభ్యులు15000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ సురేష్ మాతో పాటు ఆటో నడుపుతు కుటుంబాన్ని పోషించుకున్నాడని ఆయన మృతితో కుటుంబం వీధిన పడిందని ఆయన కుటుంబానికి తమ వంతుగా ఆర్థిక సహాయాన్ని అందించామని అన్నారు.సురేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.