త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన బిజెపి నేతలు
మానకొండూర్ లో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు
మానకొండూరు, ఆర్ సి, సెప్టెంబర్ 17( జనం సాక్షి)
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మానకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ జెండాను బిజెపి మానకొండూర్ నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజు ఎగురవేసి, మిఠాయిలు పంపిణీ చేశారు.
అనంతరం దేశ ప్రధాని, నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా పల్లె మీద కూడలిలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి మాట్లాడారు. ఆనాడు నిజాం నిరంకుశ పాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందిన రోజును విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, విమోచన దినోత్సవం విస్మరించిన వారే ఈరోజు కేంద్ర ప్రభుత్వం పిలుపుతో జెండా ఎగురవేయడం అభినందనీయమన్నారు .ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలన్నారు. భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ మద్దతుదారులు అధిక సంఖ్యలో, జెండా ఆవిష్కరణ, ప్రధాని జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పాని తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు బొంగొని శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణాచారి, ఎస్టీ మోర్చా జిల్లా కార్యదర్శి మొగలి శ్రీనివాస్,కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మరవేణి మల్లయ్య,మండల ప్రధాన కార్యదర్శి సోన్నాకుల శ్రీనివాస్, నాయకులు కత్తి ప్రభాకర్ గౌడ్,వుషకోయిల రమేష్, మీస రమణయ్య, భాషబోయిన ప్రదీప్ యాదవ్,మార్కొండ రమేష్ పటేల్,ఆరెల్లి శ్రీహరి, పూసల సాయికుమార్, ఎద్దులాపురం అశ్వన్ తేజ, నందగిరి బలరాం, గడ్డం సంపత్, కొండ్ర వరప్రసాద్, కత్తి రాకేష్ గౌడ్, బుర్ల బన్ను, బుర్ర అభి,రుధ్రోజు గణేష్, తదితరులు పాల్గొన్నారు.