Thursday, 5 November 2026

బీజేపీ రాష్ట్ర కార్యర్శి ప్రకాశ్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం.

మల్లాపూర్ (జనం సాక్షి )సెప్టెంబర్:17 మండల కేంద్రంలోని భరతమాత విగ్రహం వద్ద ఈరోజు బిజెపి కార్యదర్శి ప్రకాష్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు .చాకలి ఐలమ్మ, దొడ్డ కొమురయ్యలను న్యూస్ ఛానల్ లో తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం చేసిన ఐలమ్మ దొడ్డి కొమురయ్యల పోరాటాన్ని చిన్న చూపుగా చూసి చిట్టి ఎలుక తో పోల్చినచిన్న చూపుగా మాట్లాడినందుకు రజక (చాకలి )వాళ్ళ మనోభావానికి దెబ్బతీసినందున బేషరతుగా రజక వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ మండల రజక సంఘం బండపల్లి నరసయ్య ఉపాధ్యక్షులు లక్ష్మీరాజ్యం ప్రధాన కార్యదర్శి జంబుక రమేష్ ఆయా గ్రామాలకు అధ్యక్షులు రజక సంఘ సభ్యులు గంగరాజం, స్వా.మి నరసయ్య ,రాజేంrదర్ పాల్గొన్నారు