త్వరలోనే రెండవ విడత అక్రిడేషన్ ప్రక్రియకు

-కలెక్టర్ తో చర్చలు జరిపిన ఐజెయూ నాయకులు
-సానుకూలంగా స్పందించిన కలెక్టర్ శశంక

మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్13(జనంసాక్షి)

అక్రిడేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేసేందుకు రెండవ విడత సమావేశం ఏర్పాటుకు సమయం ఇవ్వాలని టీయూడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా కోశాధికారి శ్రీహరితో కలిసి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశంక తో మంగళవారం సమావేశమై చర్చించగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి అర్హులైన జర్నలిస్టులకు కార్డులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. సమావేశానికి కావాల్సిన ఫైల్స్ ను సిద్ధం చేయాలని కలెక్టర్ డిపిఆర్ఓ ను ఆదేశించారు.