దంచి కొట్టిన వర్షాలు కూలిన ఇల్లు ఇంకా శిధిలావస్థలోనే గ్రామస్తులు-గాంధారి మండలం

_గాంధారి జనంసాక్షి జులై 23
 కామరెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గుర్జాల్ గ్రామంలోని  కురుస్తున్న భారీ వర్షాలకు  బ్యాగరి పోషయ్య  గంగారం సంజీవులు మరియు బ్యాగరి భాగ్య  వీరు నివసించే దాబా ఇల్లు ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఒక్కసారిగా కూలిపోవడం జరిగింది ఈ ఘటనలో భాగ్యవతికి వారి కుమార్తెకి స్వల్ప గాయాలు అయ్యాయి ఇట్టి విషయాన్ని తెలుసుకున్న గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూర్పు రాజులు మరియు నాయకులు అక్కడికి వెళ్లి కూలిపోయిన దాబా ఇల్లును పరిశీలించి తమ వంతు సహకారంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజులు  ఒక్కొక్క కుటుంబానికి 50 కేజీల బియ్యం వెయ్యి రూపాయలు నగదును అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తూర్పు రాజు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు మండలంలో చాలా వరకు నిరుపేదల ఇల్లు భారీ వర్షాలకు కూలిపోతున్నాయి  ఇట్టి విషయమై సంబంధిత అధికారులు మరియు ఎమ్మెల్యే  వెంటనే స్పందించి వారికి తక్షణమే డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేసి ఆర్థికంగా వారిని ఆదుకోవాలని  డిమాండ్ చేశారు అలాగే ఈ ఘటనలో గాయపడిన బ్యాగారి భాగ్య వారి కూతురును హాస్పిటల్ వెళ్లి పరమర్శించారు