రూతు వివరాల సేకరణలో అధికారులు బిజీ
నెలాఖరుకు పూర్తి చేసేలా ఉరుకులు పరుగులు
హైదరాబాద్,జూన్28(జనం సాక్షి): మరో రెండుఎరోజులు మాత్రమే గడువు ఉండడంతో బీమా వివరాల సేకరణ ఊపందుకుంది. ఆయా గ్రామాల్లో రైతులను కలిసిన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది రైతులకు సంబంధించిన నామినీ పేర్లు, ఆధార్ ఇతర వివరాలను సేకరించారు. రైతు బీమాలో భాగంగా వ్యవసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ల పరిధిలో రోజుకు 4 వేల నుంచి 5 వేల మంది రైతుల వివరాలను తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏలు, ఏవోలు గ్రామాల్లో పర్యటిస్తూ బీమా వివరాల సేకరణను పరిశీలిస్తున్నారు. రైతులకు ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయనుండగా జిల్లాలో ఈ పక్రియ ఈ నెల 10 నుం చి ప్రారంభమైంది. రైతులకు బీమా పథకం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ప్రారంభంకానుండగా ఈలోపు జిల్లాలో ఇందుకు సంబంధించిన పక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రైతుబీమా విషయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేంధర్‌రెడ్డి ఇటీవల జిల్లాలో పర్యటించివ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతు సమన్వయ సమితి సభ్యులకు అవగాహన కల్పించారు. ఫలితంగా ఈ పక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. గ్రామాల్లోని రైతు కుటుంబాల్లో నామినీని నిర్ధారణ చేస్తూ నామినేషన్ ఫారంపై పట్టాదారు సంతకం తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా జూలై 10 లోపు వివరాల సేకరణ పూర్తవుతుందని అధికారులు తెలిపారు. కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాల్లోని వివరాల ఆధారంగా గ్రామాల్లోని రైతుల నుంచి బీమా పత్రాల్లో వ్యవసాయ శాఖ సిబ్బంది అవసరమైన సమాచారాన్ని తీసుకుంటున్నారు. రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి కాగానే రోజు ఎన్ని గ్రామాల్లో ఎంత మంది రైతుల వివరాలను పత్రాల్లో పొందుపర్చారనే విషయాలను తీసుకుని ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడూ నివేదికలు అందజేస్తున్నారు. జూలై 10 వరకు జి ల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తామని అ ధికారులు అంటున్నారు. గ్రామాల్లోని రైతు సమన్వ య సమితుల సభ్యులు అధికారులకు సహకారం అందిస్తున్నారు. రైతుబీమా పథకంలో గ్రామాల్లోని 18 నుంచి 59 వయస్సు ఉన్న రైతులు అర్హులు కాగా బీమాకు అవసరమైన ప్రీమియం రూ.2272ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ పథకంలో భాగంగా రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుం డా బీమా పరిహారంలో రూ.5 లక్షలు అందజేస్తారు. ఈ పథకంలో వయస్సు నిర్దారణ తప్పనిసరిగా మారింది. ఆధార్‌కార్డులోని వయస్సును పరిగణలోకి తీసుకుంటున్నారు.




