జహీరాబాద్ మార్చి 8 (జనం సాక్షి ) జహీరాబాద్ పట్టణంలో బుధవారం దత్తాత్రేయ స్వామి భక్తులు పాదయాత్ర లో భాగంగా జహీరాబాద్ పట్టణమునకు వచ్చిన సందర్భంగా పాదయాత్ర భక్తులకు జహీరాబాద్ కాంట్రాక్టర్ రాజు పటేల్ భక్తులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్ర భక్తులు గత కొన్ని రోజులుగా నారాయణఖేడ్ నియోజకవర్గం లోని బెల్లాపూర్ ఆశ్రమం నుండి ప్రారంభమైన పాదయాత్ర జహీరాబాద్ కు చేరుకున్నదన్నారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి అవధూత గిరి మహారాజ్, డాక్టర్ సిద్దేశ్వర స్వామి, చేతుల మీదుగా బ్యాగులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అల్లాడి వీరేశం, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.




