Thursday, 5 November 2026

దళితుల అభివృద్ధి ని జీర్ణించుకోని ఎమ్మెల్యేను వెంటనే సస్పెండ్ చేయాలి

అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 8
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దళిత కులాలను విచ్చినం చేసితద్వారాదళిత నాయకత్వాన్ని అణిచివేసేందుకు కుట్ర చేస్తున్నావు.ఖబర్దార్.అని మేడ్చల్ జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఈ మురళీకృష్ణ ఆరోపించారు. శనివారం అల్వాల్ లో ఆయన మీడియాకు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దళిత వర్గాలను అనిచి వేసేందుకు నిరంతర కుట్రలు చేస్తున్నాడని అంతేకాక దళిత నాయకత్వం ఎదగనీయకుండా చేసే నిర్విరామ ప్రయత్నాల్లో తలమునకలయ్యారని తెలిపారు. అందులో భాగంగానే అనాదిగా హైందవ సమాజం జరుపుకుంటున్నటువంటి విజయదశమి ఉత్సవాలలో భాగంగా యాచారం ఎంపీపీ కొప్పు సుకన్య భాషా  విజయదశమి ఉత్సవాలు జరుపుతూ ఆ ఉత్సవాలకు నాయకత్వాన్ని వహిస్తున్న సందర్భంలో జీర్ణించుకోలేని మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఆయనకు ఉన్న అంగబలం అర్థిక బలాలతో కొప్పు సుకన్య భాషాపై భౌతిక దాడులు చేసి గాయపరిచాడని అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దళిత వ్యతిరేక వైఖరి కాదని దళితులపై వారి దాడులు నిర్విరామంగా చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో అభివృద్ధి పనులలో సైతం ప్రోటోకాల్ విస్మరించి దళిత ఎంపీపీ అయిన సుకన్య భషాను కొబ్బరికాయ కూడా కొట్టనీయకుండా అడ్డుకున్నటువంటి సందర్భం ఉందని ఈ క్రమంలో ప్రజల్లో కొప్పు సుకన్య భాషకు పెరుగుతున్నటువంటి మంచి పేరును చూసి వారు ఏనాటికైనా తనకు రాజకీయ ప్రత్యర్థులుగా మారి తనని ఓడిస్తారని భయంతో వారినీ అణచివేసే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నటువంటి దళిత సామాజిక వర్గాల్లో చిచ్చులు పెడుతూ దళిత నాయకత్వాన్ని ఎమ్మెల్యే మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అయితే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కొప్పు సుకన్య బాషా పై చేస్తున్న భౌతిక దాడులను ఖండిస్తూ.. పునరావృత్తం అయితే తగిన రీతిలో జవాబు చేపుతామని హెచ్చరించారు. అలాగే భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన కేసీఆర్ వైఖరిపై తన వైఖరి ఏంటో చెప్పాలను మంచి రెడ్డి కిషన్ రెడ్డిని ఆయన అనుచరులను డిమాండ్ చేస్తున్నామన్నారు.