దళితుల అభ్యున్నతి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ

కుల్కచర్ల, అక్టోబర్ 18 (జనం సాక్షి):
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, తెలంగాణ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా ఆదేశానుసారం కుల్కచర్ల మండలంలోని సాల్వీడ్ గ్రామంలో మంగళవారం దళితవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.అనంతరం
బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గాదె మహిపాల్ ముదిరాజ్, ఎస్సీ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగ్యేం శ్రీనివాస్ మాట్లాడుతూ..దళిత బిడ్డ రామ్నాథ్ కోవింద్ కు మద్దతిచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతిగా పదోన్నతి కల్పించి గౌరవించలేదా అని అన్నారు.దళితుల అభ్యున్నతి కోరుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని గుర్తు చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అధికారంలోకి వస్తే దళిత బిడ్డను ముఖ్యమంత్రి చేస్తాని చేయలేదు.దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తా అని ఇవ్వలేదు.ఇప్పుడైనా దళిత బంధు పథకం దళిత బిడ్డలందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల అధ్యక్షులు గడుసు మహిపాల్, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు గుడాల వెంకటేష్, సోషల్ మీడియా కన్వీనర్ నరేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.