హైదరాబాద్,జూన్29(జనం సాక్షి): కేసీఆర్ మాటలు వింటే కడుపు నిండుతుంది.. కానీ చేతలు చూస్తే కడుపు మండుతోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన తరువాత బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారన్నారు.. కానీ ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చేయలేదని ఆరోపించారు. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారని గుర్తుచేశారు. చివరికి అది కూడా ఇవ్వలేదని విమర్శించారు. దళిత ఐఏఎస్లకు కూడా అన్యాయం జరుగుతోందన్నారు. రాజీవ్శర్మకు పదవి పొడిగించడం వల్ల దళిత అధికారి ప్రదీప్ చంద్రకు అన్యాయం జరిగిందని చెప్పారు. ప్రభుత్వానికి దళితులంటే ఎందుకు వివక్ష అని నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని సండ్ర కోరారు.
—-




