దళిత బందుతో పేదల జీవితాల్లో వెలుగు లు.

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి.
తాండూరు అగస్టు 30(జనంసాక్షి)దళిత బందుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాండూరు పట్టణం లోని దళిత బంధు పథకం ద్వారా మంజూరైన సెంట్రింగ్ యూనిట్ నీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, తాండూర్ శాసనసభ్యులు పైలెట్ రోహిత్ రెడ్డితో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళిత బంధు ద్వారా మంజూరైన
పథకాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారుడు మోహన్,తదితరులు ఉన్నారు.