Wednesday, 4 November 2026

దళిత బంధు దేశానికి ఆదర్శం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

(జనంసాక్షి) జూలై
ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన దళితులను పైకి తీసుకువచ్చి ఆదాయ వనరులను మెరుగుపరిచి స్వలాంబన కలిగించాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో దళిత బంధు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ చెందిన దళిత బంధు లబ్ధిదారులులంబోదరుడు రాజశేఖర్ కు వాహనాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్థిక స్వలాంబన తోనే దళితుల అట్టడుగు నుండి పైకి రాగలుగుతున్నారని. అందరితో కలవగలుగుతారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డా తర్వాత అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని. వారు అన్ని రంగాలలో ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు రచించి అమలు పరుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్, ప్రభాకర్, విజయ్, శేఖర్, జనార్ధన్, కుట్టి, సు దేశ్, జెడి నర్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area