Thursday, 5 November 2026

దళిత బంధు ద్వారా లబ్ధిపొందిన గొర్రెలు కోళ్ల ఫారం యూనిట్లను పరిశీలించిన అధికారులు

దళిత బంధు ద్వారా లబ్ధిపొందిన గొర్రెలు కోళ్ల ఫారం యూనిట్లను పరిశీలించిన అధికారులు

ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 15 (జనంసాక్షి) మండలంలోని మొరిపిరాల గ్రామంలో దళిత బంధు ద్వారా మంజూరు అయిన గొర్రెలు మరియు కోళ్ల ఫామ్ లను జిల్లా పశుసంవర్ధక వైద్యులు కృష్ణ మరియు ఎస్సి కార్పొరేషన్ ఈడి శ్యామ్ సుందర్ పరిశీలించటం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచి ఆరోగ్యవంతమైన గొర్రలను ఎంపిక చేసుకున్నందుకు వారికి అభినందించారు ఇట్టి అవకాశాన్నీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సామ తిర్మల్ రెడ్డి ఎంపీడీఓ యాదగిరి మండల వైద్యాధికారి గిరి పంచాయతీ కార్యదర్శి ఆంబోజు శేఖర్ బీఆర్ యెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దసాని లక్ష్మీనారాయణ దళితబంధు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు