అల్వాల్ (జనంసాక్షి) జూలై 29
దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మల్కాజ్గిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటపురం డివిజన్ లోని దళిత బంధు కింద మంజూరైన జెఎస్ రెడీమేడ్ బట్టల దుకాణాన్ని స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితుల్లో ఆర్థికసాధికారిక స్వలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఈ పథకం కింద ఒక్కో నీరు పేద దళిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందని. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి, మచ్చ బొల్లారం డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్, స్థానిక టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనిల్ కిషోర్, నాగేశ్వరరావు, అనంతుల సంతోష్, ప్రభాకర్, రాజేష్, కన్న, శ్రీశైలం యాదవ్, బబిత, కవిత, శకుంతల, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




