Wednesday, 4 November 2026

దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే

అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 7
దళితులసమగ్ర అభివృద్ధి అభ్యున్నతి కోసమే దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ కాళ్ళ మీద తము నిలబడినప్పుడే ఈ పథకానికి సార్ధకత ఏర్పడుతుందని మల్కాజిగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ దళిత బంధు లబ్ధిదారుల టైలర్ షాప్ బట్టల దుకాణాన్ని ప్రారంభించిన  స్థానిక కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాలతో సమానంగా ఆర్థిక సాధికారిత సాధించాలని మరో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా కృషి చేయాలని అందుకే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ సర్కిల్ అధ్యక్షులు కొండల్ రెడ్డి, బి నాగేశ్వరరావు, బలవంత రెడ్డి, రాజసింహారెడ్డి, భాస్కర్ రావు, అనంతల సంతోష్, మోసిన్, మల్లెలశివ, జనార్ధన్, సుదేశ్, జ్యోతి యాదవ్, రమ, వసుంధర, తదితరులు పాల్గొన్నారు.