ప్రభుత్వ ఉపాధ్యాయునికి డాక్టరేట్

గరిడేపల్లి, ఆగస్టు  (జనం సాక్షి): మండలంలోని రాయిని గూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణ గాదె సతీష్ తండ్రి రాములు కు ఉస్మానియా విశ్వ విద్యాలయం లోని డిపార్ట్మెంట్ ఆఫ్ అనిసెంట్ ఇండియన్ హిస్టరీ కల్చర్ అండ్ ఆర్కియాలజీ నుండి హిందు నారెటివ్ థీమ్స్ ఇన్ మినియెచర్ పెయింటింగ్స్ ఫ్రొం హైదరాబాద్  మ్యూజియం విత్ బిర్లా మ్యూజియం హైదరాబాద్  అనే అంశం పై చేసిన పరిశోధనకు గాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి 5-8-2022 తారీకున జరిగిన 82 వ స్నాతకోతత్సవం లో  గవర్నర్  తమిలసై సౌందర్య రాజన్  సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్ వీ రమణ  చేతుల మీదుగా డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈయన ప్రస్తుతం దామరచర్ల మండలం తాల్ల విరప్పగూడెం మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్  లో  ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతీయ కళలు సంస్కృతి భాషలు అంటే తనకు ఎంతో ఇష్టం అని అందుకే 64 భారతీయ కళల్లోని చిత్రకళను పరిశోధన అంశంగా ఎంపిక చేసుకున్నానని చెప్పారు.అందుకే హైదరాబాద్ మ్యూజియంలో అంతగా ఎవరు పరిశోధన చేయని లఘు చిత్రాలను పరిశోధన విషయంగా ఎంపిక చేసుకుని దిగ్విజయంగా పూర్తి చేశారు. వృత్తి పరంగా బోధన కొనసాగిస్తూనే ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి చివరకు పూర్తి చేయగలిగానని  చెప్పారు. తాను  సొంతంగా తయారు చేసుకున్న డిజిటల్ పాఠాలను తమ పాఠశాలలోనీ  ప్రొజెక్టర్ ద్వారా పిల్లల కు బోధిస్తారు. కొత్త కొత్త బోధన అభ్యసన సామగ్రిని తానే స్వయంగా తయారు చేసుకుని ఆఫ్ లైన్ తరగతి లో కూడా వినూత్నమైన బోధన పద్ధతుల ద్వారా పిల్లలకు సులభంగా అర్థం అయ్యే విధంగా బోధిస్తారు.అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వ అధికారిక ఛానల్  టి శాట్ లో కూడా పోటీ పరీక్షలకు ప్రసారం అయ్యే డిజిటల్ పాఠాలు  పాఠశాల డిజిటల్ తరగతులు కూడా బోధిస్తారు. అంతే కాకుండా అనేక పత్రికలలో ఈయన వ్యాసాలు ప్రచురించబడ్డాయి. జాతీయ అంతర్జాతీయ సెమినార్ లలో కూడా అనేక వ్యాసాలు సమర్పించారు.ఈ పరిశోధన పూర్తి చేయడంలో తన భార్య ఎంతో సహకరించిందని ఆమె సహాయ సహకారాలు లేకుండా పరిశోధన పూర్తి కాదని గుర్తు చేశారు. అంతే కాకుండా తన గైడ్ డాక్టర్ కమలాకర్ గుండెపూడి రిటైర్డ్ డైరెక్టర్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆర్కియాలజికల్ రీసెర్చ్ హైదరాబాద్ గారి సహకారానికి ధన్యవాదాలు తెలియచేశారు.ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ, ఆర్ట్స్ కళాశాల, ఉస్మానియ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎన్ ఆర్ గిరిధర్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.