దళిత బంధు లబ్ధిదారులకు వాహనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్

మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించిన దళిత బంధు లబ్ధిదారులు
కేసముద్రం జులై 16 జనం సాక్షి / మండల కేంద్రంలో శనివారం అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించి అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసినారు.మండల కేంద్రంలో దళిత బందు లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు డప్పుల చప్పుళ్లతో, కోలాట నృత్యాలతో,దళిత బందు వాహనాలతో ఘనంగా స్వాగతం పలికి స్థానిక అంబేద్కర్ సెంటర్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం మండల టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ…దళితుల కళ్ళల్లో ఆనందం నింపిన దళిత బంధు నాడు కూలీలుగా ఉన్న వారిని నేడు యజమానులుగా చేసిందన్నారు.రాష్ట్రంలో ప్రతి కులాన్ని ఆదరించి అందరికీ సంపదను సమానంగా పంచుతున్న గొప్ప సీఎం కేసీఆర్ అని కొనియాడారు.సమావేశ అనంతరం లబ్ధిదారులకు వాహనాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దళిత బంధు లబ్ధిదారులు సీఎం కేసీఆర్ మరియు ఎమ్మెల్యే భానోత్ శంకర్ నాయక్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.….ఇదే రోజున మండలంలోని మహమూద్ పట్నం, కోమటిపల్లి గ్రామంలో పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను స్వయంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి,ఎంపీపీ ఓలం చంద్రమోహన్,మార్కెట్ చైర్మన్ మర్రి నారాయణరావు,మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు నజీర్ అహ్మద్,కమటం శ్రీను,పట్టణ అధ్యక్షులు వీరు నాయక్,నెహ్రూ రెడ్డి,దామర కొండ ప్రవీణ్,డికొండ వెంకన్న,మోడం రవీందర్,నీలం దుర్గేష్,సట్ల వెంకన్న,ఫరీద్, శ్రీనివాస్ రెడ్డి, బొబ్బిలి మహీందర్ రెడ్డి,నీలం యాకయ్య,శతకోటి నరేష్,మరియు వివిధ గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ లు,వార్డు సభ్యులు,గ్రామ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.