రైతుబంధుతో మరింత ప్రతిబంధకం
జిల్లాల్లో భూమలు అమ్మకానికి ముందుకు రాని వైనం
హైదరాబాద్,జూన్18(జనం సాక్షి): దళితులకు మూడెకరాల చొప్పున వ్యవసాయ భూమి పంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ కృషితో ముందుకు సాగుతున్నా సాగుయోగ్యమైన భూమి దక్కడం లేదు. గ్రామాల్లో భూముల రేట్లు పెరగడం, రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందడంతో భూముల అమ్మకానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. దీనికి తోడు ప్రభుత్వం ఎకరాకు నాలుగైదు లక్షలను మించి ఇవ్వడం లేదు. ఈ నిబందన ఇప్పుడు దళితుల భూమి పథకానికి ప్రతిబంధకంగా మారింది. కలలో కూడా ఊహించని విధంగా భూమినిచ్చి, పంట పెట్టుబడి సాయంచేస్తున్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి భూముల కొనుగోలు సవాల్‌గా మారింది. వ్యవసాయ పనుల్లోనో, ఉపాధి హావిూ పథకాల్లోనో చాలీచాలని కూలితో జీవితాలను నెట్టుకొచ్చినదళితులకు భూమి ఇచ్చి ఆసగా నిలవాలనుకున్నా పూర్తిస్థాయిలో ఇది అమలు కావడం లేదు. తమకంటూ సొంత భూమిని చూడని బడుగులకు ఇప్పటికే కొన్నిచోట్ల భూములు అందాయి. అనేక జిల్లాల్లోని అర్హులైన లబ్ధిదారులు ఎక్కువగా ఉండటంతో పంపిణీ పక్రియలో జాప్యం కొనసాగుతున్నది.వ్యవసాయ యోగ్యమైన భూముల కొనుగోలు అన్నది ప్రతిబంధకంగా మారింది. దళితబస్తీలో భాగంగా అధికారులు వ్యవసాయానికి యోగ్యమైన, వివాదాల్లేని భూములనే కొంటున్నారు. భూమి అమ్మాలనుకునే రైతు ఎన్నేండ్లనుంచి అందులో ఏ పంటలు సాగుచేస్తున్నాడు? పంటల దిగుబడులు ఎలా ఉన్నాయి? నీటి సౌకర్యం ఉందా! బోరు వేస్తే నీళ్లు పడుతాయా? విద్యుత్ సౌకర్యం ఉందా? తదితర విషయాలన్నీ పరిశీలిస్తున్నారు. అన్నీ బాగున్నాయని ధ్రువీకరించుకున్నాకే ఎకరాకు రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఈ భూముల్లో వానకాలం పంటలతోపాటు నీటి సౌకర్యం ఉండటంతో యాసంగి పంటలను సైతం పండిస్తున్నారు. అయితే ఇలాంటి భూములకు తక్కువ ధరలు చెల్లించి అమ్మడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. తాజాగా ఇప్పుడు రైతుబందు పథకం తోడవ్వడంతో తక్కువ ధరలకు భూములను అమ్మడంలేదు. జిల్లాలో అర్హులందరికీ మూడెకరాల భూమి పంపిణీచేయడానికి ఇప్పుడు ఉన్న రేట్లతో భూములు కొనుగోలు చేయడం అసాధ్యమని ఎస్పీకా ర్పోరేషన్ అధికారులు అంటున్నారు. ఒక్కో జిల్లాలో కనీసం వెయ్యి ఎకరాలను అందజేయాలని నిర్ణయించినా కనీసంగా 300 ఎకరాలనుమంఇచ పంచలేకపోయారు.




