Wednesday, 4 November 2026

దళిత విద్యార్థిని కొట్టి చంపితే ఎందుకు ఖండించలేదు.

తొర్రూర్  19 ఆగస్టు( జనంసాక్షి ) రాజస్థాన్ రాష్ట్రంలో 9వ తరగతి చదువుతున్న ఇంద్ర కుమార్ ను టీచర్ కొట్టి చంపితే ఎందుకు ఖండించడం లేదని భారత కార్మిక సంఘాల సమైక్య ఐ ఎఫ్ టి యు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి రవిఅన్నారు.నేడు ఇంద్ర కుమార్ చిత్రపటానికి  ప్రజాపంద, ఐఎఫ్టియు, ఏఐకేఎంఎస్, పి వై ఎల్,పి డి ఎస్ యు ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. అనంతరం రవి మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీకి కూత వేటు దూరంలో ఒక దళిత విద్యార్థి కొట్టి చంపడం ఏ నీతి అని అన్నారు.స్వాతంత్ర వజ్రోత్సవాలను గళ్ళి నుండి ఢిల్లీ దాకా ఘనంగా నిర్వహిస్తున్న పాలకవర్గ పార్టీ లు ఈ అమానుష అనాగరిక చర్యను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. దళితులు గిరిజనులు అట్టడుగు వర్గాల ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఆ వర్గాల పై దాడి చేస్తుంటే ఎవరికి వచ్చింది ఈ స్వాతంత్రం అని అనుమానం కలుగుతుందన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మైనారిటీ గర్భిణీ పై అత్యాచారం చేసిన దుర్మార్గులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం ఈ దేశంలో దళితులు గిరిజనులు మైనార్టీలు రెండవ శ్రేణి పౌరులుగా గుర్తించబడుతున్నారన్నటానికి ఇదే నిర్దర్శనం అన్నారు. దళితులు గిరిజనులు అట్టడుగు వర్గాల ప్రజలపై అణిచివేత వివక్షత దోపిడిని ఖండించేది వారికి అండగా ఉండేది ఎర్రజెండా మాత్రమేనని కమ్యూనిస్టులేనని రవి అన్నారు.కేంద్ర ప్రభుత్వం ప్రజల పట్ల బాధ్యత ఉంటే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా గట్టి ప్రయత్నాలు చేయాలని రవి అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంధ సబ్ డివిజన్ కార్యదర్శి ముంజపల్లి వీరన్న మాట్లాడుతూ పేదలను ఓట్లు సీట్లు ఇచ్చిన వారీగా మాత్రమే చూస్తున్న పాలకవర్గ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పటానికి పీడిత వర్గాల ఐక్యంగా కావాలని అన్నారు. ఈ కార్యక్రమానికి మంగళపల్లి ప్రసాద్ అధ్యక్షత వహించగా ఏం యాకయ్య శేఖర్ చరణ్ వెంకన్న వెంకటమ్మ మహేష్ సాయిలు సుశీల వెంకటయ్య తదితరులు ప్రసంగించారు.