Tuesday, 3 November 2026

దళిత వ్యతిరేకి చంద్రబాబు, టిడిపి నేతలే: టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విమర్శ

హైదరాబాద్‌,మార్చి9(జ‌నంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబు దళిత వ్యతిరేకి అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,రసమయి బాలకిషన్‌ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో బాబు డ్రామాలు ఆడుఉతన్నారని అన్నారు. అసెంబ్లీ విూడియా పాయింట్‌లో గువ్వల మాట్లాడుతూ  చంద్రబాబు రాసిచ్చిన స్కిప్టున్రు తెలంగాణ టీడీపీ నేతలు చదువుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు దళిత వ్యతిరేకులు అని.. వారి పేరు చెప్పుకుని కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ టీడీపీ నేతలకు కనువిప్పు కలగకపోతే కాలగర్భంలో కలిసిపోతారని చెప్పారు. సంపత్‌కుమార్‌ సభకు ఆటంకం కలిగిస్తున్నారని మండిపడ్డారు. శాసనభలో టీడీపీ సభ్యులు చేసిన చిల్లర పనులను చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని తెలిపారు. ఆంధప్రదేశ్‌ సీఎం చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు అసలైన దళిత ద్రోహులు అని రసమయి బాలకిషన్‌ మండిపడ్డారు. దళితులకు సీఎం కేసీఆర్‌ సమున్నత స్థానం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. దళితుల పేర్ల చెప్పుకుని టీడీపీ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సాంస్కృతిక మండలి అధ్యక్షుడిని. ప్రభుత్వ చీప్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌,ఉపముఖ్యమంత్రి  కడియం శ్రీహరి వీరంతా దళితులు కాదా అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ దళితపక్షపాతి అని ఉద్ఘాటించారు. ఆనాడు ఏపీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించి రిజర్వేషన్లకు స్థానం కల్పించారు.  ఏపీ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై తీర్మానం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు తెలంగాణ దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ సభ్యులను ప్రజలు అస్యహించుకుంటున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుట్రలో భాగంగానే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు శాసనసభను అడ్డుకున్నారని రసమయి బాలకిషన్‌ అన్నారు. చంద్రబాబు రాసిచ్చిన ప్లకార్డులు పట్టుకుని వచ్చారని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు దళితుడు అయిన కడియం శ్రీహరి టిఆర్‌ఎస్‌ లో మంత్రి అయితే దళితుడు కాకుండా పోతారా అని ఆయన అన్నారు.దళితులలో విబేధాలు తేవడానికి టిడిపి ప్రయత్నం చేస్తున్నదని అన్నారు.దళితుల పేరు చెప్పి పబ్బం గడుపుకోవడానికి టిడిపి ప్రయత్నిస్తున్నదని అన్నారు. వర్గీకరణపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీర్మానం చేసిన చంద్రబాబు ఇప్పుడు అదికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వర్గీకరణకు తీర్మానం చేయడం లేదని అన్నారు. దళితుల ప్లకార్డులు పట్టుకుని తమను అవమానించడానికి టిడిపి నేతలు ప్రయత్నిస్తున్తున్నారని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *