Wednesday, 4 November 2026

దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి. డిఐఈఓ రఘురాజ్.

కోటగిరి జూన్ 3 జనం సాక్షి:-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 20 రోజుల పాటుగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని,కళాశాల బోధన,బోధ నేతరా సిబ్బంది రోజువారి కార్యక్రమాలలో పాల్గొనాలని నిజామాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రఘురాజ్ ఆదేశించారు.శనివారం రోజున కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన సందర్శించి కళాశాలలో జరుగుతున్న విద్యార్థుల అడ్మిషన్ వివరాలను కళాశాల అధ్యాపకులకు అడిగి మరిన్ని సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కోటగిరి మండలాలతో పాటుగా చుట్టుపక్కల మండలాలలోని పదవ తరగతి పాసైన విద్యార్థులను కళాశాలలో చేరే విధంగా అడ్మిషన్ డ్రైవ్ కు కృషి చేయాలన్నారు. ఈ అడ్మిషన్ డ్రైవ్లో కళాశాల అందిస్తున్న నాణ్యమైన విద్యతో పాటుగా ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలు,ఉచిత పాఠ్యపుస్తకాలు,స్టడీ మెటీరియల్స్
,బస్సు పాస్ సౌకర్యాల విషయంలో విద్యార్థులకు అవగాహన కల్పించి అడ్మిషన్లు చేయాలన్నారు. ఆయన వెంట కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపల్ అనిల్ కుమార్,అధ్యాపకులు రిజ్వానా,రవీందర్,దత్తాత్రి, గోవర్ధనగిరి,శ్రీలత,శ్రీధర్,నిరంజన్ బాబు,వి.రాము, సంతోష్,వెంకటేష్ ఉన్నారు.