అల్వాల్ (జనంసాక్షి) అక్టోబర్ 8
తెలంగాణ మేరు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే దసరా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి కుల బంధువులు అధిక సంఖ్యలో హాజరుకావాలని అల్వాల్ జోన్ 11 అధ్యక్షుడు రాపర్తి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. అల్వాల్ సర్కిల్ కార్యాలయములో మేరు సంఘం ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన పత్రాన్ని సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ బాగాయాత్ లో ఈనెల 9న జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి జోన్ 11 అల్వాల్ నుండి అధిక సంఖ్యలో కుల బంధువులు అందరూ హాజరు కాగలరని రాపర్తి చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి దీ కొండ వెంకటేష్, కోశాధికారి గంధం కిషన్, రాపర్తి ప్రభాకర్, నాగేశ్వరరావు, మునిగాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




