దహణసంస్కారాలకు ఆపన్న హస్తం అందించిన – మేఘారెడ్డి
వనపర్తి బ్యూరో అక్టోబర్05 (జనంసాక్షి)
వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలం గౌరీదేవి పల్లి గ్రామానికి చెందిన కోరుపాల కిష్ణయ్య మరణించగ దహణసంస్కారాల నిమిత్తం గ్రామ కాంగ్రెస్ నేతలు ఆర్థిక సహాయం అందివాలని వనపర్తి నియోజకవర్గ నేత మేఘారెడ్డి దృష్టికి తీసుకువెల్లగా మానవతా దృక్పథంతో స్పందించి దహణసంస్కారాల కు మేఘన్న భరోసా పథకం క్రింద అయిదు వేలు ఆర్థిక సహాయాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందచేశారు.ఈ కార్యక్రమంలో కోరుపాల రమేష్ ,కనుకట్ల తిరుపతయ్య ,ఈర్ల బాలపీరు ,తిప్ప కాశన్న తదితరులు పాల్గొన్నారు




