దాతల సహకారం అభినందనీయం…

సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు…
అనంతగిరి, జనంసాక్షి:
పాఠశాల అభివృద్ధికి దాతల సహకార అభినందనీయమని అమీనాబాద్ గ్రామ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు అన్నారు. గ్రామంలో జన్మించి ఆర్థికంగా స్థిరపడి పుట్టిన ఊరికి అభివృద్ధి చేయలానే ఆకాంక్షతో…. సాఫ్ట్వేర్ ఉద్యోగులు శ్రావణం వేణు,హిమ బిందు 1,50,000 రూపాయలతో బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు  ప్రొజెక్టర్ ను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా దంపతులు ఇద్దరిని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.