Thursday, 5 November 2026

దార్శనికుడు నావాజ్‌ అలీ జంగ్‌

నివాళిలో మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌,జూలై11(జ‌నం సాక్షి): తెలంగాణ ఇంజినీర్స్‌ డే సందర్భంగా జలసౌధలో ప్రముఖ ఇంజినీర్‌ నవాజ్‌ అలీ జంగ్‌ బహదూర్‌ విగ్రహానికి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో విస్మరణకు గురైన వైతాళికుడు నవాజ్‌ అలీ జంగ్‌ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, అద్భుత కట్టడాల రూపకర్త నవాజ్‌ అలీ జంగ్‌ అని మంత్రి తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లోనే ఆయన జన్మదినాన్ని ఇంజినీర్స్‌ డేగా ప్రకటించుకున్నామని గుర్తు చేశారు. ప్రతి ఇంజినీర్‌ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం కావాలని మంత్రి హరీశ్‌ రావు పిలుపునిచ్చారు.