గుంటూరు,జూలై11(జనం సాక్షి): నరసరావుపేట పట్టణంలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని కోరుతూ నరసరావుపేటలోని స్పీకర్ కార్యాలయంలో బుధవారం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావుకు ఆటో కార్మికులంతా వినతిపత్రం అందజేశారు. ఇక్కడ పారిశ్రామికంగా ఎదుగుతున్న క్రమంలో ఆటోనగర్ అసవరం ఉందన్నారు. విజయవాడ తరహాలో ఇక్కడా ఏర్పాటు చేస్తే కార్మికులకు మేలు జరుగుతుందన్నారు.




