హైదరాబాద్: దిల్‌సుఖనగర్ ప్రాంతంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. చాదర్‌షూట్ మీదుగా దిల్‌సుఖ్‌నగర్ వచ్చే బస్సులను నల్లంగొండ చౌరస్తా వద్ద దారి మళ్లిస్తున్నారు. ఎల్‌బీ నగర్ వైపు నుంచి వచ్చే వాహనాలను కొత్తపేట మీదుగా దారి మళ్లించారు. నేడు పలు పార్టీల నేతలు ఘటనాస్థలిని పరిశీలించనున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




