దివ్యాంగులకు పెంచిన ఆసరా పెన్షన్ మంజూరు కార్యక్రమానికి హాజరైన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి

భువనగిరి టౌన్ జనం సాక్షి :-
ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు ఆసరా పెన్షన్ 3116 నుండి 4116 రూపాయలకు పెంచిన సందర్భంగా ఈరోజు భువనగిరి పట్టణంలోని జిఎన్ఆర్అన్నారు ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పెంచిన ఆసరా పెన్షన్ ల మంజూరి కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు పెరిగిన ఆసరా పెన్షన్ మంజూరి పత్రాలను వారికి అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి దివ్యాంగులను ఉద్దేశించి మాట్లాడుతూ. భువనగిరి నియోజకవర్గంలో దివ్యాంగులకు ప్రతినెల 4 కోట్ల 5లక్షల రూపాయల ఆసరా పెన్షన్ లను అందిస్తున్నాం అని మన ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల అవస్థలు తెలిసిన వారు కాబట్టి పెద్ద మనసుతో 3116 రూపాయల పెన్షన్ ను 4116 రూపాయలకీ పెంచడం తో 5కోట్ల 39 లక్షల రూపాయలు ఇస్తున్నాం అని అన్నారు. వెయ్యి రూపాయలు పెంచడంతో అదనంగా 1కోటి 34 లక్షలు ఇస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు వెయ్యి రూపాయలు పెంచినందుకు ప్రతి దివ్యాంగుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. అనేక సంక్షేమ పథకాలతో ప్రజలకు పెద్ద దిక్కుగా నిలిచిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని మరోసారి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకునే బాధ్యత మనదని అన్నారు.