ది వారియర్‌ రొటీన్‌ కమర్షియల్‌ సినిమా

రామ్‌ రోల్‌పై నెటిజన్ల కామెంట్స్‌
డైనమిక్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తో ’ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి మాస్‌ మూవీ చేసిన రామ్‌ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించాడు. 2019లో విడుదలైన ఈ చిత్రం సూపర్‌ హిట్‌ గా నిలవడంతో.. రామ్‌ తన ఫోకస్‌ మొత్తాన్ని మాస్‌ చిత్రాలవైపే మల్లించాడు. ఇస్మార్ట్‌ శంకర్‌ తర్వాత వచ్చిన ’రెడ్‌’ మాస్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే. ఇందులో రామ్‌ ద్విపాత్రాభినయం చేశాడు. 2021లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినా రామ్‌ వెనక్కి తగ్గలేదు. తాజాగా ’ది వారియర్‌’ వంటి మరో మాస్‌ ఎంటర్‌టైనర్‌ తో వచ్చాడు. కోలీవుడ్‌ డైరెక్టర్‌ ఎన్‌. లింగుసామి ఈ చిత్రాన్ని తెరకెక్కించిగా శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌ గా నటించింది. జూలై 14న తెలుగు తమిళ భాషల్లో రిలీజ్‌ అయిన ఈ చిత్రం.. తొలి షో నుండే నెగటివ్‌ రివ్యూలను సొంతం చేసుకుంది. ఒక రొటీన్‌ కమర్షియల్‌ సినిమా అంటూ చాలా మంది పెదవి విరిచారు. అయితే నెగటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ మాస్‌ సినిమా కాబట్టి బీసీ సెంటర్స్‌లో ఈ మూవీ బాగానే కలెక్షన్స్‌ రాబడుతోంది. అయినాసరే నిర్మాతలకు భారీ నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. ఇక ఈ మూవీ అనంతరం రామ్‌ ప్రముఖ స్టార్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేస్తున్నాడు. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదీ మాస్‌ నేపథ్యంలో తెరకెక్కబోతున్న చిత్రమే. అయితే వరుస ఎª`లాపులు పడుతుండటంతో.. రామ్‌`బోయపాటి సినిమా రిజల్ట్‌ ఎలా ఉంటుందో అని అభిమానులు కలవర పడుతున్నారు. మరోవైపు అతిగా మాస్‌ చిత్రాల వెంట పడి బొక్క బోర్లా పడటం కంటే.. క్లాస్‌ చిత్రాలను కూడా కవర్‌ చేస్తే మంచిదని రామ్‌ కు పలువురు హితవు పలుకుతున్నారు